విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్ర ప్రభుత్వం మోసగించిందని
ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి
వ్యతిరేకంగా శుక్రవారం శాసనసభ సమావేశాలకు నలుపు రంగు చొక్కాతో హాజరయ్యారు.శుక్రవారం
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్ననేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా
విభజన హామీల సాధన సమితి చేపట్టిన రాష్ట్ర బంద్కు సంఘీభావంగా ఏపీ సీఎం చంద్రబాబు నల్ల చొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చారు.ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సహాయనిరాకరణకు నిరసనగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు నల్లదుస్తులు ధరించి రావాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో పలువురు సభ్యులు కూడా నల్లదుస్తులు ధరించి సభకు హాజరయ్యారు.