అమరావతి: ప్రధాని మోదీ విశాఖ రాకకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నల్ల చొక్కా ధరించారు. నల్లచొక్కాతో ప్రజా వేదిక వద్ద ప్రత్యేక హోదా, ఏపీ అభివృద్ధికి కేంద్రం మొండి చేయి చూపిస్తోందని మండి పడ్డారు. రైల్వేజోన్ ఇచ్చినట్లే ఇచ్చిఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే యత్నం చేసిందని ధ్వజ మెత్తారు. కేంద్రం వైఖరి కుట్ర పూరితమని మండిపడ్డారు. నూతన రైల్వే జోను వల్ల రాష్త్రానికి ఒనగూడే ప్రయోజనం శూన్యమని విశ్లేషించారు.