ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పటికి ద్రవ్య లోటు 3.2 శాతం ఉంటుందని కేంద్రం తెలిపింది. అదే లోటు 2019-20 కి 3.1 శాతం ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోండగా.. జిడిపి వృద్ధి సాధిస్తోందని కేంద్ర గణాంకాల శాఖ పేర్కొంది. బడ్జెట్లో రూ.210 లక్షల కోట్లు అంచనా వేస్తూ.. 11.5 శాతం వృద్ధి సాధిస్తామని కేంద్రం చెబుతోంది. దీనికి రూ.225 లక్షల కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ సెక్రటరీ ఎస్సి గార్గ్ పేర్కొన్నారు.