దేశానికి నరేంద్ర మోదీ రక్షకుడా?

దేశానికి నరేంద్ర మోదీ రక్షకుడా?

బెంగళూరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి
శుక్రవారమిక్కడ ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రజలతో పాటు, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కుమారస్వామిక్కడ విలేఖరులతో మాట్లాడారు “.దేశానికి తనకు తాను రక్షకుడుగా మోదీ చెప్పుకుంటునే తనవారిని రక్షించుకునేందుకు అవినీతిని ప్రోత్సహిస్తున్నారని” మండిపడ్డారు. దీన్ని పార్లమెంటులో లేవనెత్తాలని కుమారస్వామి విపక్షాలను కోరారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా.. సమాఖ్య వ్యవస్థను దెబ్బదీసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు , వీటన్నింటిపై రుజువులతో సహా నిరూపిస్తామన్నారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కునేందుకు చూస్తోందని ఆరోపించారు. ఇప్పటికే అయిదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అజ‍్ఞాతంలో ఉన్నారన్నారు. బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, బల నిరూపణ చేసుకుంటామని కుమారస్వామి స్పష్టీకరించారు.

ఆపరేషన్‌ కమల వీడియో విడుదల

 ఆపరేషన్‌ కమల పేరుతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను భాజపా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని చాలా రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి సమావేశంలోఆడియో టేపును విడుదల చేశారు. ఇప్పటికే  ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనబడటం లేదని చెప్పారు

విప్‌ జారీ చేసిన జేడీఎస్‌, కాంగ్రెస్

బడ్జెట్‌ సందర్భంగా జేడీఎస్‌, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేశాయి. కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, అసంతృప్తులకు బీజేపీ గాలంవేస్తోందని ఆరోపణలతో రెండు పార్టీల నేతలు అప్రమత్తమయ్యారు. సమావేశాలకు ఎమ్మెల్యేలు తప్పక హాజరు కావాలని విప్‌ జారీ చేశారు. ఏ ఒక్కరు రాకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సమావేశాలకు దూరంగా ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి కుమారస్వామి ఇవాళ శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నరు.కర్ణాటకలో గత ఏడాది కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో తొలుత అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. గవర్నర్‌ అవకాశమివ్వడంతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభలో ఆయన బలనిరూపణ చేసుకోలేకపోవడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos