దిల్ రాజు షాకింగ్ డెసిషన్

  • In Film
  • February 1, 2019
  • 182 Views
దిల్ రాజు షాకింగ్ డెసిషన్

కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలు ప్రకటిస్తుంటారు చాలా మంది. కొంత మంది కొత్త ను జీవితంలోకి ఆహ్వానిస్తుంటారు.  అయితే దిల్ రాజు మాత్రం ఈ కొత్త సంవత్సరం ఎవరూ ఊహించలేని ఓ సరికొత్త సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ` జగపతిబాబు హీరోగా నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన `పెళ్లి పందిరి సినిమాతో పంపిణీ రంగంలోకి ప్రవేశించిన వెంకటరమణారెడ్డి అలియాస్ దిల్ రాజు ఆ తరువాత పవన్ కల్యాణ్ నటించిన ఎవరగ్రీన్ హిట్ `తొలిప్రేమ`తో పాపులర్ డిస్ట్రిబ్యూటర్ అయ్యారు. అప్పటి నుంచి పంపిణీ రంగంలో రారాజుగా వెలిగిపోయిన ఆయన గత కొంత కాలంగా భారీ నుంచి అతి భారీ నష్టాలని చవిచూస్తున్నారు.

2017- 2018లో ఆయన నిర్మించిన – పంపిణీ చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో బోల్తా కొట్టాయి. ఇక రీసెంట్ గా ఆయన యూవీ – ఎన్ వీ ప్రసాద్ తో కలిసి విడుదల చేసిన శంకర్ – రజనీ కాంబో మూవీ `2.ఓ` అంచనాల స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో దిల్ రాజు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. పంపిణీ దారుడిగా ఈ రంగంలోకి వచ్చిన ఆయన ఆ రంగంపై వున్న మమకారాన్ని చంపుకోలేక ఇన్నాళ్లూ సినిమాలు పంపిణీ చేస్తూ వచ్చారు. అయితే గత రెండేళ్లలో తగిలిన దెబ్బల కారణంగా ఇక నుంచి పంపిణీ రంగానికి దూరంగా వుండాలని సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి బయటి సినిమాలను పొరపాటున కూడా డిస్ట్రిబ్యూట్ చేయనని – ఎవరైనా ఆ విషయంలో సహాయం చేయమంటే మాత్రం తన వంతు సహాయ సహకారం అందించడానికి ముందుకొస్తానని దిల్ రాజు వెల్లడించడం ట్రేడ్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన  పంపిణీ రంగం నుంచి తప్పుకున్నానని ప్రకటించినా.. అది సాధ్యమేనా? అంటూ ఓ ఆసక్తికర డిబేట్ ట్రేడ్ లో రన్ అవుతోంది. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos