దిల్ రాజుకు ఎన్ని థియేటర్లు ఉన్నాయి.. ఇదీ సంగతి!

  • In Film
  • January 31, 2019
  • 212 Views
దిల్ రాజుకు ఎన్ని థియేటర్లు ఉన్నాయి.. ఇదీ సంగతి!

చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య వచ్చినప్పుడల్లా ‘ఆ నలుగురు’, ‘థియేటర్ మాఫియా’ అంటూ టాపిక్ తెరపైకి వస్తుంది. ఆ నలుగురే థియేటర్లను శాసిస్తున్నారు అంటూ విమర్శలు మొదలవుతాయి. కానీ దీని వెనక ఉన్న స్ట్రగుల్ ఏమిటి? ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అనేది చాలా మందికి తెలియదు. ఇటీవల సంక్రాంతి సినిమా రేసులో కూడా ఓ నిర్మాత థియేటర్లు దక్కలేదనే కోపంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ‘ఎఫ్ 2’ ప్రమోషన్లో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయమై దిల్ రాజును ప్రశ్నించగా ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఒక థియేటర్ రన్ చేయడానికి, మెయింటేన్ చేయడానికి ఎలాంటి స్ట్రగుల్ ఉంటుందో వెల్లడించారు.

అలా లెస్సీస్ మొదలయ్యారు గత దశాబ్దకాలంగా పాత థియేటర్లన్నీ కొత్త థియేటర్లుగా మార్పు చెందడం జరుగుతోంది. ఒక్కో థియేటర్ కొత్తగా మార్చాలంటే కనీసం రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఎగ్జిబిటర్ ఈ పెట్టుబడి పెట్టడం వల్ల వాళ్లకు వచ్చే రిటర్న్స్‌లో వడ్డీ వర్కౌట్ కాదు. ఈ క్రమంలో లెస్సీస్ మొదలయ్యారని దిల్ రాజు తెలిపారు.
నాకు 40 థియేటర్లు ఉన్నాయి..
నైజాం ఏరియాలో 400 థియేటర్లు ఉంటే.. నాకు 40 థియేటర్లు ఉన్నాయి. ఏషియన్ వారి వద్ద దాదాపు 160 థియేటర్లు ఉన్నాయి. బయటి వారికి 200 థియేటర్లు ఉన్నాయని దిల్ రాజు తెలిపారు.
వారు నష్టపోయి లీజుకు ఇవ్వడం మొదలు పెట్టారు..
ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే… థియేటర్ ఓనర్(ఎగ్జిబిటర్) సినిమా వేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్‌కు 20 లక్షలు అడ్వాన్స్ ఇస్తే, సినిమా ప్లాప్ అయితే… కేవలం 5 లక్షలే వచ్చేవి. ఆ ఎగ్జిబిటర్ ఆ 15 లక్షలు రికవరీ చేసుకోవడానికి సంవత్సరాలు పట్టేది. ఆ డిస్ట్రిబ్యూటర్‌కు మళ్లీ హిట్ పడితే తప్ప ఆ డబ్బులు వచ్చేవి కావు. ఇలా ఎగ్జిబిటర్లు అడ్వాన్సులు ఇచ్చీ ఇచ్చీ వారి డబ్బులు బ్లాక్ అయిపోయి… ఈ గొడవ అంతా ఎందుకు అని వారు లీజుకు ఇచ్చే ప్రాసెస్ మొదలు పెట్టారు. 15 ఏళ్ల క్రితం ఇది మొదలైందని తెలిపారు.
సరైన రాబడి లేకనే…
ఎకనమిక్స్ పరంగా చూస్తే.. థియేటర్ వ్యాల్యూ ఏమిటి? దానిపై ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది చాలా మంది ఆలోచించరు. ఎంతో మంది థియేటర్లు మూసుకుని కమర్షియల్ కాంప్లెక్సుల వైపు ఎందుకు షిప్ట్ అవుతున్నారు? సరైన రిటర్న్స్ లేకనే… అని దిల్ రాజు తెలిపారు.
డబ్బులు రావడం లేదు..
ఉదాహరణకు నాకు ఖమ్మంలో ఓ థియేటర్ ఉంది. దాని విలువ 20 కోట్లు. బ్యాంకులో పెట్టినా డబ్బు నెలకు 20 లక్షల ఆదాయం వస్తుంది. కానీ థియేటర్ నడిపిస్తే 10 లక్షలు రావు. థియేటర్ కట్టాం కాబట్టి ప్రాపర్టీ వ్యాల్యూ పెరుగుతుంది కాబట్టి దాన్ని అలాగే నడుపుతుంటాం. ఎగ్జిబిషన్ చాలా టఫ్ జాబ్ కాబట్టే వారు మెల్లిగా లీజులకు ఇవ్వడం మొదలు పెట్టారు అని దిల్ రాజు తెలిపారు.
అది ఎవరికీ కనిపించవు..
ఇది కేవలం మన వద్దే కాదు.. బాలీవుడ్, ఇతర పరిశ్రమల్లో కూడా ఉంది. కానీ ఈ విషయంలో మన వద్ద కాస్త ఎక్కువ హంగామా చేస్తున్నారు. చాలా మంది ఎగ్జిబిటర్స్ చాలా చిన్న సినిమాలను పర్సంటేజీల ప్రకారం రిలీజ్ చేసినవి చాలా ఉన్నాయి. అవి ఎవరికీ కనిపించవని తెలిపారు.
వారికి ప్లానింగ్ లేకనే..
చిన్న సినిమాలకు, బయటి సినిమాలకు చాలా అవకాశాలు ఇచ్చినా ఒకదాన్ని పట్టుకుని హైలెట్ చేస్తారు. వారికి ప్లానింగ్ లేదు. సంక్రాంతికి తెలుగు సినిమాలు 3 విడుదలవుతున్నాయి. బయటి డబ్బింగ్ సినిమాను అప్పుడే రిలీజ్ చేయడం అవసరమా? అంటూ దిల్ రాజు అభిప్రాయ పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos