ద్విచక్ర మోటారు వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ..పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ జారీ
చేసిన ఉత్తర్వును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ స్వామి
వ్యతిరేకించారు. బుధవారం నారాయణస్వామి రాజ్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు.. ఈ ఆందోళనలో
మంత్రి వర్గ సహచరులు కూడా పాల్గొన్నారు. నల్లదుస్తులు ధరించిన.. వారు గవర్నర్ నిర్ణయాన్ని రీకాల్ చేయాలని
కేంద్రాన్ని డిమాండు చేసారు. హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని డీజీపీ ఆదేశించిన నియమావళిని దశలవారీగా అమలు చేయాలని కోరారు. తమ నిరసనను శాంతియుతంగా లిపామన్నారు. . రోడ్డుపై హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర
మోటారు వాహనదారుల్ని గవర్నర్ కిరణ్ బేడీ స్వయంగా
ఆపేసి. హెల్మెట్లు
ధరించాలని హెచ్చరించిన. వీడియోను సోమవారం తన ట్విట్టర్లో పోస్టు చేశారు .