తేదాపాకు మరో షాక్‌…

తేదాపాకు మరో షాక్‌…

ఊహించిందే జరిగింది.ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ బుధవారం తెదేపాకు ఆమంచి రాజీనామా చేసారు.ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాసారు.పార్టీకి సంబంధం లేని కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నామంటూ లేఖలో పేర్కొన్నారు.గత ఎన్నికల్లో నవతరం పార్టీ తరపున బరిలో దిగి విజయం సాధించిన ఆమంచి అనంతరం తెదేపాలో చేరారు.అయితే పార్టీలో తగిన గుర్తింపు లేదని పార్టీకి సంబంధం లేని వ్యక్తులు పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారంటూ సన్నిహితుల వద్ద ఆమంచి వాపోయినట్లు కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇదే విషయమై కొద్ది రోజుల క్రితం తెదేపా అధినేత చంద్రబాబుతో కూడా ఆమంచి సమావేశమయ్యారు. అంతకుముందు మంత్రి శిద్ద రాఘవరావు,తెదేపా జాతీయ కార్యదర్శి లోకేశ్‌లు చేసిన బుజ్జగింపు యత్నాలు ఫలించకపోవడంతో నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగారు.అయినప్పటికీ శాంతించని ఆమంచి బుధవారం ఊహాగాలను నిజం చేస్తూ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ వేడిని మరింత పెంచారు.మరోవైపు ఆమంచి రాజీనామాతో … టీడీపీ నేత కరణం బలరామ్‌ను…చీరాల వెళ్లి పార్టీ పరిస్థితిని సమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారు.రాజీనామా అనతంంర ఆమంచి నేరుగా హైదరాబాద్‌ చేరుకొని వైసీపీ అధినేత జగన్‌ను కలిసారు.గురువారం జగన్‌ సమక్షంలో ఆమంచి కృష్ణమోహన్‌ చేరనున్నట్లు సమాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos