తేజస్‌లో బిపిన్‌ రావత్‌

తేజస్‌లో బిపిన్‌ రావత్‌

బెంగళూరు: స్వదేశీ తయారీ  తేలికపాటి యుద్ధ విమానం- తేజస్‌లో పదాతి దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ తొలి సారిగా  గురువారం విహరించారు. ఇక్కడి యలహంక వాయుసేన స్థావరంలో జరుగుతున్నఅంతర్జాతీయ వైమానిక ప్రదర్శన-  ఏరోఇండియా 2019లో పాల్గొన్న ఆయన మరో పైలట్‌తో కలిసి  తేజస్‌లో ప్రయాణించారు. ఇందుకు అవసరమైన శిక్షణ కూడా తీసుకున్నారు.  శాస్త్రీయ సలహాదారు   పీఎస్‌ రాఘవన్‌ కూడా తేజస్‌లో ప్రయాణించారు.  తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ బుధవారం వాయుసేనలో చేరింది. ‘తేజస్‌’కు నిర్వహణ అనుమతి పత్రాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ భారత వైమానిక దళానికి అందజేసింది. యుద్ధాలకు ఈ విమానం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పటమే ఈ పత్రాల ఆంతర్యం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos