హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ నియమితులవడంతో ఆయన నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే టీఆర్ఎస్ తరుపున 88, కాంగ్రెస్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2, బీజేపీ 1, ఇద్దరు స్వతంత్రులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే.