తెలంగాణ అసెంబ్లీ…ఇవే ప్రత్యేకతలు

తెలంగాణ అసెంబ్లీ…ఇవే ప్రత్యేకతలు

తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అనేక ప్రత్యేకతలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో ఆయా పార్టీల  బలాబలాలు ఇలా ఉన్నాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీకి 88 మంది సభ్యులున్నారు. ఖమ్మం జిల్లా వైరా నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన రాములు నాయక్ – రామగుండం నుంచి గెలిచిన కోరుకంటి చందర్ .. ఇటీవల టీఆర్ ఎస్ లో చేరారు. వీరి చేరికతో.. టీఆర్ ఎస్ బలం 90కి చేరింది. కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలు – ఎంఐఎంకు ఏడుగురు – టీడీపీకి ఇద్దరు – బీజేపీకి ఒక సభ్యుడున్నారు. వామపక్షాల తరఫున ఒక్కరూ గెలవలేదు.2014 ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలిచిన సీట్లు 63. ఈసారి ఎన్నికల్లో భారీగా సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ గతంలో 21 స్థానాల్లో గెలిస్తే.. ఈసారి రెండు తగ్గి.. 19స్థానాల్లో గెలుపొందింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు కొందరు ఎన్నికల్లో ఓడిపోయారు. మరోవైపు టీడీపీ ఈసారి భారీగా నష్టపోయింది. 2014లో 15 సీట్లు గెలిచిన  తెలుగుదేశం.. ఈసారి రెండు సీట్లతోనే సరిపెట్టుకుంది. మజ్లిస్ పార్టీ సీట్లల్లో గతానికి ఇప్పటికీ ఎలాంటి తేడా లేదు. బీజేపీకి భారీ నష్టం జరిగింది. గత అసెంబ్లీలో కమలానికి ఐదు సీట్లుంటే.. ఈసారి ఒక్క స్థానాన్నే దక్కింది. గత ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు.ఇదిలాఉండగా టీఆర్ ఎస్ పార్టీ అధినేత – సీఎం కేసీఆర్ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం అసెంబ్లీలో ముఖ్యమంత్రే సీనియర్ ఎమ్మెల్యే. కేసీఆర్ వరుసగా 8సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గెలిచిన నేతలు ముగ్గురు ఉన్నారు. ప్రస్తుత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ – సీనియర్ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్ – ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన లిస్టులో ఉన్నారు. ఎంపీలుగా ఉన్న సీహెచ్  మల్లారెడ్డి – బాల్కసుమన్ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – పట్నం నరేందర్ రెడ్డి – మైనంపల్లి హనుమంతరావు ఈసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మైనంపల్లి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. మల్లారెడ్డి – బాల్క సుమన్ – రాజగోపాల్ రెడ్డి – నరేందర్ రెడ్డి..శాసనసభకు కొత్తవారే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos