న్యూఢిల్లీ:ప్రత్యర్థుల తుపాకీ కాల్పలు వల్ల తీవ్రగాయమై,రక్తం కారుతున్నా కూతురును పరీక్ష కేంద్రానికి చేర్చాడు ఓ తండ్రి..బీహార్ రాష్ట్రంలోని బేగుసరాయ్ జిల్లాలో రాష్ట్రీయ జనతాదళ్ కు చెందిన రాంక్రిపాల్ మహతో మాజీ సర్పంచ్. పదో తరగతి పరీక్షలను రాసేందుకు కూతురితో బైక్‌పై గురువారం బే గుసరాయ్ పట్టణానికి బయలు దేరాడు. పరీక్ష కేంద్రానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆరుగురు సాయుధులు రాంక్రిపాల్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తూటాలు దిగి రక్తం కారుతున్నా పట్టించుకో లేదు. వేళకు సరిగ్గా కూతురిని పరీక్షా కేంద్రంలో వదిలాడు. అనంతరం స్థానికుల సహకారంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పాత కక్షల వల్లే రామ్‌కృపాల్‌పై కాల్పులు జరిపారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.