తారకరత్నకు జీహెచ్ఎంసీ షాక్

  • In Local
  • February 4, 2019
  • 1020 Views

సినీ నటుడు నందమూరి తారకరత్నకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో తారకరత్న నిర్వహిస్తున్న కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంటును కూల్చేందుకు అధికారులు యత్నించారు. ఈ సందర్భంగా అధికారులతో రెస్టారెంట్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అధికారులతో వాదనకు దిగారు. రాత్రి వేళల్లో మద్యం అమ్మకాలతో పాటు పెద్ద శబ్దాలతో ఇబ్బంది పెడుతున్నారని సెన్స్ చేస్తున్నారంటూ సొసైటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos