టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య

  • In Crime
  • February 6, 2019
  • 217 Views
టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య

ప్రేమ విఫలమై బుల్లితెర వర్ధమాన నటి ఆత్మహత్యకు పాల్పడడం బుల్లితెర ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన నాగ ఝాన్సీ(21)ఇప్పుడిప్పుడే పలు ధారావాహికల్లో నటిస్తూ నటిగా ఎదుగుతున్నారు.హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలోని సాయిరామ్‌ రెడిడెన్సీలో కుటుంబంతో కలసి నివసిస్తున్నారు. ధారావాహికలతో పాటు ఝాన్సీ బ్యూటీ పార్లర్ కూడా నిర్వహిస్తుండేవారు.ఈ క్రమంలో కొద్ది కాలంగా విజయవాడకు చెందిన సూర్య అలియాస్‌ నాని అనే కుటుంబ స్నేహితుడితో ఝాన్సీ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం.సూర్యతో పరిచయమైన అనంతరం ఝాన్సీ ధారావాహికల్లో నటించడంపై ఆసక్తి కనబరచపోవడంతో కొద్ది కాలంగా ధారావాహికల్లో అవకాశాలు తగ్గిపోయాయి.మరోవైపు ఎంతగానో ప్రేమించిన సూర్య కూడా కొద్ది రోజులుగా దూరం పెడుతుండడంతో మానసికంగా మరింత కృంగిపోయిన ఝాన్సీ మంగళవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.కార్యాలయం నుంచి వచ్చిన ఝాన్సీ తమ్ముడు దుర్గప్రసాద్‌ ఎంతగా పిలిచినా ఝాన్సీ తలుపులు తెరవకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా ఝాన్సీ ఉరేసుకొని ఉండడాన్ని గమనించి వెంటనే పంజగుట్ట పోలీసులకు సమాచారం అందించారు.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఝాన్సీ మృతదేహాన్నీ గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు.ప్రేమ పేరుతో సూర్య మోసం చేయడంతోనే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో పోలీసులు సూర్య కోసం గాలింపు ముమ్మరం చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos