జీలకర్ర బెల్లంలో జీలకర్ర తక్కువగా ఉందనీ కొట్టాడు

  • In Film
  • January 18, 2019
  • 964 Views
జీలకర్ర బెల్లంలో జీలకర్ర తక్కువగా ఉందనీ కొట్టాడు

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న మహిళా సింగర్లలో కౌసల్య ఒకరు. ఈమెకు మంచి పేరుంది. పైగా, దివంగత సంగీత దర్శకుడు చక్రి దర్శకత్వంలో అనేక పాటలు పాడి. మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈమె తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తాజాగా బహిర్గతం చేసింది.

‘మా పెళ్లయిన తర్వాత 16 రోజుల పండుగకు కోసం మా ఆడపడుచు ఇంటికెళ్లాం. అక్కడ చిన్నపాటి గొడవ జరిగింది. పెళ్లి సమయంలో వధూవరుల తలపై పెట్టే జీలకర్ర బెల్లంలో జీలకర్ర తక్కువగా ఉన్నదనే ప్రస్తావన వచ్చింది. ఈ విషయంపై మా అమ్మను తిట్టడం మొదలు పెట్టగా, ఈ విషయంలో మా అమ్మ తప్పు లేదని నేను వాదించాను. అంతే.. మా వారు నాపై చేయిచేసుకున్నారని సింగర్ తెలిపింది.అంతేకాకుండా, మా నాన్నగారికి, మా మామగారికి మంచి స్నేహం, సాన్నిహిత్యం ఉండేదన్నారు. ఈ కారణంగానే తమ రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధం ఏర్పడిందన్నారు. కానీ, మామామ పోవడంతో తనకు కష్టాలు ఎక్కువయ్యాయని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos