టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన జియో ఫోన్ వినియోగదారుల కోసం రెండు నూతన ప్లాన్లన ఇవాళ ప్రవేశపెట్టింది. రూ.594, రూ.297 ప్లాన్లను జియో ఫోన్ యూజర్లు ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు. రెండు ప్లాన్లలోనూ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 500 ఎంబీ డేటా, నెలకు 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది. ఇక రూ.297 ప్యాక్ వాలిడిటీ 84 రోజులు ఉండగా, రూ.594 ప్యాక్ వాలిడిటీ 168 రోజులుగా ఉంది.