హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాకేష్‌రెడ్డికి ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి సహకరించినట్లు తేలింది. దీంతో ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేశారు. మల్లారెడ్డి వ్యవహారశైలిపై అధికారులు ఆగ్రహం వేస్తూ బదిలీ వేటు వేశారు. మల్లారెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇంఛార్జ్ ఏసీపీగా గాంధీనారాయణను నియమించారు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్‌ను హైదరాబాద్ కమిషనర్ బదిలీ చేశారు. గతంలోనూ భూకబ్జా కేసులో రాకేష్‌రెడ్డికి ఏసీపీ మల్లారెడ్డి సహకరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాకేష్‌రెడ్డి.. జయరామ్‌ను హత్య చేయగానే ఏసీపీ మల్లారెడ్డితో ఫోన్ మాట్లాడినట్లు తెలుస్తోంది.