అప్పు చెల్లించలేదనే కారణంతోనే రాకేష్.. జయరాంను హత్య చేశాడని పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసులో జయరాం భార్య పద్మశ్రీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో శిఖా చౌదరి పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. నిజాలు నిగ్గు తేల్చి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు పద్మశ్రీ. దీంతో ఈ కేసు మరో మలుపు తిరుగుతోంది. జయరాం కేసులో శిఖా చౌదరిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన భార్య. దీనిపై ఆమె హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శిఖా చౌదరిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరారు. యరాం మరణం తన జీవితాన్ని కుంగదీసిందని వాపోయారు పద్మశ్రీ. రాకేష్ రెడ్డి దగ్గర జయరాం 80 లక్షలు తీసుకున్నారనది అవాస్తవమని చెప్పారు. మరోవైపు ఏపీ పోలీసులపైనా అనుమానాలు వ్యక్తం చేశారు పద్మశ్రీ. పోస్ట్‌మార్టం రిపోర్ట్ అడిగితే ఇవ్వలేదన్నారు. జయరామ్ హత్య హైదరాబాద్‌లోనే జరిగినందున కేసును తెలంగాణ పోలీసులు మాత్రమే దర్యాప్తు చేయాలని కోరారు. జయరాం హత్య తర్వాత శిఖా చౌదరి హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చిందని ఆరోపించారు పద్మశ్రీ. ఇంట్లోని విలువైన వస్తువులు పోయాయని తెలిపారు. జయరాం హత్య దోషులను కఠినంగా శిక్షించి తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.జయరాం హత్య కేసుపై జూబ్లీహిల్స్ పోలీసులు ఆచితూచి స్పందించారు. ఇంట్లో విలువైన వస్తువులు పోయాయని పద్మశ్రీ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫిబ్రవరి 1న శిఖా చౌదరి వాచ్‌మెన్ దగ్గర ఇంటి తాళాలు తీసుకొని ఇల్లంతా సర్దిందని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.వాయిస్ : ఫిర్యాదు అందుకున్న వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. శిఖా చౌదరి ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లి పలువురిని ప్రశ్నించారు. మరోవైపు త్వరలో మీడియా ముందుకు వస్తానంటున్నారు శిఖా చౌదరి తల్లి సుశీల. మరి ఆమె చెప్పబోతున్నారు..? ఆమె కుమార్తెపై వచ్చిన ఆరోపణలపై ఎలా స్పందిస్తారు..? పద్మశ్రీ వ్యాఖ్యలపై సుశీల ఏం చెబుతారన్న విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.