జయం మనదే:బాబు

జయం మనదే:బాబు

అమరావతి: రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు  తెలుగు దేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయపథంలోకి మళ్లిస్తుందని  ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆశించారు.  గురువారం ఉదయం ఇక్కడ పార్టీ నేతలతో టెలి కాన్పరెన్సు నిర్వహించారు.  పింఛన్‌ కింద ఏడాదికి రూ.24 వేలు, పసుపు కుంకుమ కింద ఒక్కో మహిళకు రూ.20 వేలు, రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి రూ.10 వేలు ఇస్తున్నామని, ఈ మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రైతు సాయానికి కేంద్రం ఎన్నో షరతులు విధించిందని తాము దానికంటే మెరుగ్గా చేశామని తెలిపారు. కౌలు రైతులకు కూడా మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నో కష్టాల్లో కూడా ఇన్ని కార్యక్రమాలు జరిగింది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలనుకోవడం చారిత్రక నిర్ణయమన్నారు..జాతీయ పార్టీల నేతలతో చర్చలు ఫలప్రదం అయ్యాయని, ఢిల్లీలో కేజ్రీవాల్ దీక్షకు గొప్ప స్పందన వచ్చింది. మోదీ పాలనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికలకు ముందే బీజేపీయేతర పక్షాల కూటమి ఏర్పాటు కావచ్చని ఆశించారు. కేజ్రీవాల్ దీక్షకు గొప్ప స్పందన వచ్చింది. మోదీ పాలనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉంది.. ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. “.చీరాలలో పార్టీ బలంగా ఉందని, నాయకులు వస్తుంటారు.. పోతుంటారు” అని ఆమంచి పార్టీ వీడడంపై వ్యాఖ్యానించారు. పార్టీని అంటి పెట్టుకుని ఉన్నది కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఆశయం కోసం పనిచేసేది వారేనని కితాబిచ్చారు. అవకాశవాదులకు తెదేపాలో స్థానం లేదని, కొందరు పోతే జరిగే నష్టం కన్నా.. లాభాలే మిన్న అని వ్యాఖ్యానించారు.. కాపులకు రిజర్వేషన్లని చెప్పి మోసగించింది వైఎస్ అని, జగన్‌కు కాపు  రిజర్వేషన్లతో సంబంధం లేదంటూ మండిపడ్డారు. కులాలను రెచ్చగొట్టే కుట్రలు వైకాపా చేస్తోందని. దుయ్యబట్టారు.తనను దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. “నేను రాష్ట్రం కోసం. 5 కోట్ల ప్రజల హక్కుల కోసం ధర్మపోరాటం. సాగిస్తుండగా  బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌. కులాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నాయి. నాపై కులముద్ర వేస్తున్నాయి “అని ధ్వజమెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos