జనాన్ని దారి తప్పిస్తున్నహస్తవాసులు: రాజనాథ్

జనాన్ని దారి తప్పిస్తున్నహస్తవాసులు: రాజనాథ్

న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. కాంగ్రెస్ పదే పదే రఫేల్ గురించి మాట్లాడుతూ ప్రజలను, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. లోక్‌సభ జీరో అవర్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు.రాజనాథ్‌ వ్యాఖ్యలకు   నిరసనగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. రఫేల్ యుద్ద విమానాల ఒప్పందంపై లోక్‌సభలో సవివరంగా చర్చించామని, సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై తుది తీర్పు ఇచ్చిందని రాజ్‌నాథ్ చెప్పారు. అయి నా కాంగ్రెస్ ఇష్టానుసారం ఈ విషయాన్ని లేవనెత్తుతోందని, సత్యం మాత్రం ఎప్పటికీ సత్యంగానే ఉంటుంద న్నారు. ప్రజలు తప్పుదోవపట్టించడం ద్వారా రాజకీయాలు చేయడం సాధ్యం కాదని కాంగ్రెస్ అర్థం చేసుకోవాలన్నారు. రాజకీయ నాయకులకు సత్యాన్ని మాట్లాడే ధైర్యం ఉండాలన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos