జగన్‌లో గూడు కట్టిన నిరాశ

జగన్‌లో గూడు కట్టిన నిరాశ

అమరావతి:వెనుకబడిన కులాల సభలో
వై.కా.పానేత జగన్మోహనరెడ్డి తీవ్ర నిరాశ ,నిస్పృహలతో ప్రసంగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వెనుకబడిన కులాలే  తెదేపాకు  వెన్నుదన్ను కావటం జగన్మోహన రెడ్డికి మింగుడు పడటం లేదని అభిప్రాయపడ్డారు. వెనుక బడిన కులాల
ఉపప్రణాళికకు తామే చట్టబద్ధత కల్పించామని మళ్లీ చట్టబద్ధత కల్పిస్తామని జగన్ అనడం ఆయన అవగాహనా రాహిత్యమని తప్పుబట్టారు. తాము విజయవంతంగా నిర్వహించిన వెనుకబడిన కులాల సభను
జగన్ జీర్ణించుకోలేక  దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళారు’ అని అన్నారు. ఆదివారం హడావుడిగా సభ జరిపి  ఏది పడితే అది మాట్లాడారన్నారు. “జగన్‌కు కన్నా లక్ష్మీనారాయణది అద్దె మైకు” అని అవహేళన చేసారు. కాపుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు.
కాపు కార్పోరేషన్ ప్రారంభించి బడ్జెట్‌లో భారీగా నిధుల్ని కేటాయించామని విపులీకరించారు.  కాపు భవన్‌లు నిర్మిస్తున్నామని, ఆ సామాజిక వర్గం విద్యార్థుల విదేశీ విద్యకు సాయం చేసామని గుర్తు చేసారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి పరిపాలనలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. తమ పాలనలో ఇది పునరావృతం కాబోదని భరోసా ఇచ్చారు. కౌలు రైతు కుటుంబానికి రూ.15వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాని
పేర్కొన్నారు. నదుల అనుసంధానంతో సత్ఫలితాలు వస్తున్నాయని ప్పారు.  సమర్ధ నీటి నిర్వహణతో అధిక దిగుబడులు వస్తున్నాయంటూ, చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు చేరాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు 66% పూర్తి అయ్యాయని చెప్పారు. 19 సాగునీటి
పథకాల నిర్మాణాలు ముగిసాయని, త్వరలో మరో నాలుగింటి పనుల్ని ప్రారంభిస్తామని విపులీకరించారు.నీరు-చెట్టు, నీరు-ప్రగతి పథకాలకు
లభించిన పురస్కారాలు ఆ రంగాల ప్రగతికి చేసిన కృషికి కొలమానాలని
అభివర్ణించారు. ‘గ్లోబల్ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్’ ప్లాటినం పురస్కారం కూడా లభించటం గర్వకారణమని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos