ఇంతవరకూ విలువైన వస్తువులు చోరీకి గురికావడాన్ని చూసుంటాం. అయితే కర్ణాటకలోని చిక్ మంగళూరులో ఒక వింత చోరీ జరిగింది. ఆవు పేడ చోరీ చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బిరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పశుసంరక్షణ విభాగానికి చెందిన డైరెక్టర్ తరపున ఆవు పేడ చోరీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అమృత్ మహల్ కవల్‌కు చెందిన స్టాక్‌లో నిల్వఉంచిన 35 నుంచి 40 ట్రాక్టర్ల ఆవుపేడ చోరీ జరిగిందని, దానివిలువ రూ. 1.25 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల విచారణలో పశు సంరక్షణ విభాగానికి చెందిన సూపర్‌వైజర్ ఈ చోరీకి పాల్పడ్డాడని తేలింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అతని వద్దనుంచి మొత్తం ఆవు పేడను స్వాధీనం చేసుకుని పశుసంరక్షణ విభాగానికి తరలించారు. కాగా ఆవు పేడను వ్యవసాయ సస్యరక్షణలో వినియోగిస్తుంటారు. అలాగే ఆయుర్వేదంలోనూ ఆవు పేడకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నేపద్యంలో ఆవు పేడకు ఎంతో డిమాండ్ ఏర్పడింది.