చేయి విరగొట్టుకున్న యాపిల్ బ్యూటీ

  • In Film
  • January 23, 2019
  • 985 Views
చేయి విరగొట్టుకున్న యాపిల్ బ్యూటీ

కెరీర్ ప్రారంభంలో తెలుగులో స్టార్ హీరోలతో చెప్పుకోదగ్గ సినిమాలు చేసిన యాపిల్ బ్యూటీ హన్సిక తర్వాత కోలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. అక్కడ వరసగా హిట్స్ దక్కడంతో ఏకంగా గుడి కట్టించుకునే రేంజ్ లో ఫాలోయింగ్ తెచ్చుకుంది. అక్కడ ఇలా పిచ్చిగా ఆరాధించడం మామూలే కానీ  బయటి హీరోయిన్ ని నెత్తినెక్కించుకోవడం చాలా అరుదు. టాలీవుడ్ లో సినిమాలు తగ్గించుకున్న హన్సిక ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి కమిట్ అయ్యింది.

తమిళ్ లో రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ అందరి దృష్టి మహా మీదే ఉంది. వివాదాస్పద అంశాలతో జమీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేస్తే వివాదాస్పదం అయ్యింది. కాశి బ్యాక్ డ్రాప్ లో కాషాయ వస్త్రాలు ధరించి హన్సిక పొగ తాగుతున్న స్టిల్ బాగా వైరల్ అయ్యింది.  తాజాగా ఈ మహా షూటింగ్ లో హన్సిక గాయపడి చేయి విరగొట్టుకుంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా కాలు జారీ కింద పడి చేతి డ్యామేజ్ చేసుకుంది. ఆ సీన్ లో పిల్లిమొగ్గలు వేయాల్సిన సీన్ ఉండటం వల్లే ఈ చిక్కు వచ్చినట్టు సమాచారం.ప్రాధమిక చికిత్స అనంతరం రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించగా కొంత విరామం తరువాత చేయితో అవసరం లేని సన్నివేశాలు పూర్తి చేసుకుని వెళ్ళిపోయిందట. ఈ మహా మీద మనదగ్గర తక్కువే కానీ కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. విడుదల సమయానికి కాంట్రోవర్సీల ద్వారా బాగానే బజ్ తెచ్చేలా ఉన్నారు. తెలుగు వర్షన్ కూడా డబ్బింగ్ రూపంలో ఒకేసారి రానుంది. ఓ లేడీ క్రిమినల్ కథ ఆధారంగా మహా రూపొందనున్నట్టు సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos