చలితో అమెరికా గడ్డ కట్టుకుపోయింది. రహదారులు కూడా కనిపించని విధంగా రోడ్లన్నీ మంచుతో కప్పేసుకు పోయాయి. కొన్ని ప్రాంతాలలో ఉష్ణగ్రత -50 డిగ్రీలకు పడిపోయింది. ఇదే సమయంలో వారెన్స్‌బర్గ్ పోలీస్ అధికారులు నేరస్థులను ఓ చిన్న కోరిక కోరారు. ‘కనీసం రానున్న మూడురోజులైనా..నేరాలను తగ్గించండి..బయట చలి తీవ్రంగా ఉంది. నేరాలకు పాల్పడొద్దు..ఇంట్లోనే ఉండండి..సహచరులతో ఆప్యాయంగా ఉండండి’ అంటూ వారెన్స్‌బర్గ్ పోలీసులు తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు. కాగా, ఒక్క వారంలోనే చలి తీవ్రతకు అమెరికాలో ఐదుగురు మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలంటూ వారు సూచించారు. 30 ఏళ్లలో ఇంత తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి అని అమెరికన్లు చెప్పుకుంటున్నారు.