చంద్రుడు అంటరానివాడా? శివసేన ప్రశ్న

చంద్రుడు అంటరానివాడా? శివసేన ప్రశ్న

ముంబయి: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాకపోతేప్రభుత్వ స్థాపనకు ఎన్డీయే తెదేపా మద్దతును కోరదా అని శివసేన.కమలనాధుల్ని ప్రశ్నించింది.గతంలో  తమ మిత్రపక్షంతెదేపాకు సంఘీభావం ప్రకటిస్తే తప్పేంటని అన్నారు. దిల్లీలో చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు శివసేన ఎంపీ సంజయ్‌ రావత్‌  హాజరై మద్దతుఇవ్వటాన్ని   భాజపా తప్పుబట్టింది.. దరిమిలా పార్టీ చర్యను శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో బుధవారం  సమర్థించుకుంది. విభజనతో కష్టాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి అండగా ఉంటామన్నారు.రాష్త్రాల విభజనను తాము ఎన్నటికీ సమర్థించబోమని కుండబద్ధలు కొట్టింది.  చంద్రబాబుకు మద్దతు ను ఆకాశం ఊడి మీదపడ్డట్లుగా భాజపా భావించిందని శివసేన ఎద్దేవా చేసింది.  ఎన్డీయేలో ఉన్నంత కాలం చంద్రబాబును గొప్ప నాయకుడిగా ఆకాశానికి ఎత్తేసిన కమలనాధులకు ఆయన హఠాత్తుగా ఎలా అంటరానివారు అయ్యారని ప్రశ్నించారు. సైద్ధాంతికంగా, రాజకీయంగా తీవ్ర విభేదాలున్న పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీతో సైతం జతకట్టిన భాజపా ఇప్పుడు తెదేపాను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos