అమరావతి: లోటు బడ్జెట్ ఉందంటూనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనేక దుబారా ఖర్చులకు పాల్పడుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత పర్యటనలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ నిధులనే విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. తాజాగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు సిద్ధమయ్యారు. ఈ దీక్షకు ఢిల్లీకు జనాలను తరలించేందుకు రూ.10 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు, ఉద్యోగులను తీసుకెళ్లెందుకు భారీ ఏర్పాట్లు చేశారు. రూ.1.12 కోట్లతో శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్లును సిద్ధం చేశారు. విమానాలు, ఇతర రవాణకు రూ.2 కోట్లు, భోజనాలు వసతులు పబ్లిసిటీకి రూ.8 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. ఉద్యోగులను భారీగా తరలించేందుకు సంఘాలకు సీఎంవో టార్గెట్ కూడా ఇచ్చింది.