జనవరి 21న ఉదయం సంపూర్ణ చంద్ర గ్రహణం పేరు ”సూపర్ బ్లడ్ ఉల్ఫ్ (తోడేలు) మూన్ లూనార్ ఎక్లిప్స్”.భారత కాలమానం ప్రకారం జనవరి 21న ఉదయం 9 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 10.11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణంగా మారి 62 నిమిషాల పాటు కొనసాగుతుంది.చంద్రగ్రహణం పేరులో తోడేలు ఎందుకు చేరింది?జనవరిలో నిండు చంద్రుడిని అమెరికాలో ‘ఉల్ఫ్ మూన్’ అని పిలుస్తారు. చలి తీవ్రంగా ఉండే ఈ కాలంలో ఆహారం దొరక్క తోడేళ్లు గ్రామాల శివార్లలో కూతలు పెడుతూ ఉండేవట. కాబట్టి, జనవరిలో కనిపించే నిండు చంద్రుడిని ఉల్ఫ్ మూన్‌గా పిలవడం అమెరికన్లకు అనాదిగా వస్తోంది.
సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అంటే.. సూర్యచంద్రుల మధ్య భూమి ఉండడం వల్ల సూర్యరశ్మి చంద్రుడిపై పడక అది భూమిపై ఉన్నవారికి కనిపించకుండా పోవడమే చంద్ర గ్రహణం.ఇంకోమాటలో చెప్పాలంటే భూమి చుట్టూ నిత్యం పరిభ్రమించే చంద్రుడు భూమి నీడలోంచి వెళ్లినప్పుడు ఇలా జరుగుతుంది.జులై 27న ఏర్పడుతున్న చంద్రగ్రహణ వివిధ దశల్లో మొత్తంగా 3 గంటల 55 నిమిషాల పాటు ఉంటుంది. అందులో 1.43 గంటల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.సూర్య రశ్మి భూవాతావరణంలోకి ప్రవేశించిన తరువాత రంగులు దేనికవి విడిపోతాయి. వాటిలో అధిక తరంగదైర్ఘ్యం ఉండే ఎరుపు, నారింజ రంగులు మాత్రం ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. చంద్రగ్రహణం రోజున భూఛాయలోకి ప్రవేశిస్తున్నప్పుడు, దాన్నుంచి బయటపడుతున్నప్పుడు.. ఆ తరువాత చంద్రుడిపైకి ఈ రెండు రంగులే ఎక్కువగా ప్రసరిస్తాయి. అందుకే ఆ రోజు చందమామ సాధారణ రోజుల కంటే ఎర్రగా కనిపిస్తుంది. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అంటారు.చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్, సూపర్ మూన్.. ఈ మూడూ ఒకేరోజు వస్తే దాన్నే సూపర్ బ్లూ బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దాన్ని బ్లూమూన్ అంటారు. భూమికి దగ్గరగా చంద్రుడు వస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు.సాధారణం కంటే 7 శాతం పెద్దగా, 15 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు., జనవరి 21న ఏర్పడే చంద్రగ్రహణం భారత్‌లో ఉండేవారికి కనిపించదు. ఉత్తర మరియు దక్షిణ అమెరికాలో, ఉత్తర యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో, వాయువ్య ఆఫ్రికా తీర ప్రాంతంలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.