గణపతిపైఅభియోగ పత్రం

గణపతిపైఅభియోగ పత్రం

 బీమా కొరేగావ్‌ కేసులో పుణే పోలీసులు
న్యాయస్థానంలో శుక్రవారం అభియోగ పత్రాన్ని 
దాఖలు చేసారు.  మావోయిస్ట్ నేత
ముప్పాల లక్మణరావు అలియాస్ గణపతి పేరు కూడా పేర్కొన్నారు. 1837 పేజీల అభియోగ
పత్రంలో  పౌరహక్కుల కార్యకర్త,  విరసం
నేత వరవరరావు, సుధా భరద్వాజ్‌, అరుణ్‌ ఫెరీరా, వెర్నోన్‌ గోన్‌సాల్వ్స్‌ను
నిందితులుగా నమోదు చేశారు. బీమా కొరేగావ్‌ అల్లర్ల పేరిట  ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే
అభియోగంపై వరవరరావు సహా పలువురు హక్కుల కార్యకర్తలను నిరుడు పుణే పోలీసులు అరెస్ట్‌
చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో విప్లవ రచయిత సంఘాల,  సామాజిక ఉద్యమాల కార్యకర్తలు, నేతలకు
సంబంధాలున్నాయని పోలీసులు ఆరోపించారు. మావోయిస్టుల లేఖ ఆధారంగానే వారిని అరెస్ట్‌
చేశామని పోలీసులు తమ చర్యను సమర్థించుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos