న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై జరిగిన చర్చల్లో ప్రధానమంత్రి కార్యాలయం ఫ్రాన్స్‌తో నేరుగా చర్చలు జరపటాన్ని రక్షణ శాఖ అభ్యంతరంచెప్పినట్లు ఓ జాతీయ దినపత్రిక వెలువరించిన కథనంపై డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ స్పందించారు. రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడీ)ఆక్షేపణ పత్రం తో సుప్రీంకోర్టు ధిక్కారానికి ప్రధాని పాల్పడినట్టు స్పష్టమవుతోందన్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వంతో పీఎంఓ సంప్రదింపులు జరిపినట్టు సుప్రీంకోర్టుకు సమర్పించిన సీల్డ్ కవర్‌లో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదని తప్పుబట్టారు. ఇంతటి తీవ్రమైన ఆరోపణలను ఒక ప్రధాని ఎదుర్కోవడంభారతదేశ చరిత్రలో ఎన్నడూ సంభవించలేదని స్టాలిన్ నిప్పులు చెరిగారు. , సమయానుకూలంగా ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీయడాన్ని ప్రత్యక్ష జోక్యంగా భావించరాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో శుక్రవారం వివరణ ఇచ్చారు. యూపీఏ హయాంలో అప్పటి జాతీయ సలహా మండలి చైర్మన్ సోనియాగాంధీ తరచు పీఎంఓ కార్యాలయాన్ని పర్యవేక్షించే వారని, అది జోక్యం చేసుకోవడం కాదా అని ప్రశ్నించారు.