కేరళలో సీపీఎంను, దేశంలో మోదీని ఓడిస్తాం: రాహుల్

కేరళలో సీపీఎంను, దేశంలో మోదీని ఓడిస్తాం: రాహుల్

కొచ్చి: కేరళలో సీపీఎం ప్రభుత్వాన్ని, దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఓడిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కేరళలోని కొచ్చి నుంచి ‘యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్’ ఎన్నికల ప్రచారానికి రాహుల్ మంగళవారంనాడు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పార్టీ బూత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల సదస్సులో రాహుల్ మాట్లాడుతూ, ప్రజలను ఐక్యంగా ఉంచగలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని ఉన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఏమి జరిగిందో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఆర్‌ఎస్ఎస్, సీపీఎంకు క్యాడర్ ఉందని అంతా అంటున్నారని, అయితే దేశానికి గుండెకాయలాంటి వాళ్లు కాంగ్రెస్ క్యాడరేనని చెప్పారు. బ్రిటిష్ పాలకుల ముందు ఆర్ఎస్ఎస్ నేతలు సాగిలపడ్డారని, దేశస్వాంతత్ర్యం కోసం కాంగ్రెస్ పోరాటం చేసిందని, ఎందరో నాయకులు జైళ్లకు వెళ్లారని, జలియన్ వాలా బాగ్, కేరళ, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో ఎందరెందరో ప్రాణాలు కోల్పోయారని మరిచిపోరాదని అన్నారు. ‘వాళ్లకి (సీపీఎం, ఆర్ఎస్ఎస్) క్యాడర్ ఉన్న మాట నిజం. అయితే మీరు దేశానికి గుండెకాయ వంటి వాళ్లు’ అని కాంగ్రెస్ కార్యకర్తలను రాహుల్ ఉత్సాహపరిచారు. విడిపోతే ఏదీ సాధించలేం…మనమంతా కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఇటు కేరళ, అటు ఇండియా ఎదుగుతాయని అన్నారు. చైనా కంటే ఇండియా ముందుకు దూసుకుపోతుందని మోదీ తరచు చెబుతుంటారని, దేశంలో మాత్రం ఎక్కడ చూసినా ‘మేడిన్ చైనా’ వస్తువులే కనిపిస్తుంటాయని రాహుల్ విసుర్లు విసిరారు. ‘ప్రతిసారి మీరిది చూడొచ్చు. చైనా యువకులు లబ్ధి పొందుతున్నారు. ఏదో ఒకరోజు మనమంతా కలిసి పనిచేస్తే చైనా యువకులు ఇండియన్ ఫోన్లతో సెల్ఫీలు తీసుకునే రోజు తప్పనిసరిగా వస్తుంది’ అని రాహుల్ అన్నారు. బీజేపీ, సీపీఎం తరహాలో హింసపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదు…దేశ ప్రజలను విడగొట్టాలని సీపీఎం, బీజేపీ చూస్తుంటాయని, అందువల్లే కేరళ సంక్షేమ వెనుకబాట పట్టిందని రాహుల్ విమర్శించారు. మహిళా హక్కులను, సంప్రదాయలను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవిస్తుందన్నారు. సీపీఎం, బీజేపీ తరహాలో హింసను కాంగ్రెస్ ఒప్పుకోదని అన్నారు. ‘కేరళ రైతులు, యువకులకు సీపీఎం చేసిందేమిటని నేను ప్రశ్నిస్తున్నాను. నరేంద్ర మోదీని కూడా నేను ఇదే అడగాలనుకుంటున్నాను’ అని రాహుల్ పేర్కొన్నారు. ఐదేళ్ల సమయాన్ని వృథా చేసిన మోదీదేశానికి విలువైన ఐదేళ్ల సమయాన్ని మోదీ వృథా చేశారని, ఒకదాని వెంట మరొక అబద్ధం చెప్పడమే ఆయన పనిగా పెట్టుకున్నారని రాహుల్ విమర్శించారు. మోదీ 15 మంది తన సంపన్న మిత్రులకు మాత్రమే ‘కనీస ఆదాయ హామీ’ ఇచ్చారని అన్నారు. ఐదేళ్లలో నీరవ్ మోదీకి 35,000 కోట్లు, మెహుల్ చోక్సీకి 30,000 కోట్లు, విజయ్ మాల్యాకి 10,000 కోట్లు, అనిల్ అంబానీకి 30,000 కోట్లు ఇచ్చారని విమర్శించారు. మోదీ 15 మంది మిత్రులకే కనీస ఆదాయ హామీ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రతి భారతీయుడికి కనీస ఆదాయానికి హామీ ఇస్తుందని రాహుల్ భరోసా ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos