కుప్పకూలిన జాగర్ ఫైటర్ విమానం

కుప్పకూలిన జాగర్ ఫైటర్ విమానం

కుషీనగర్: భారత వైమానిక దళానికి చెందిన జాగర్ ఫైటర్ విమానం ఉత్తరప్రదేశ్‌లో కుప్పకూలింది. . లక్నోకు 322 కిలోమీటర్ల దూరంలో కుషినగర్‌లో ఇవాళ ఉదయం ఈ విమానం కుప్పకూలింది. వెంటనే మంటల్లో చిక్కుకుంది.నిర్మానుష్య ప్రాంతంలో కూలడంతో పెను ప్రమాదం తప్పింది. . ఫైటర్‌ జెట్‌ నుంచి పైలట్‌ పారాచూట్‌ సహాయంతో సురక్షితంగా బయట పడ్డాడు. 
రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఈ యుద్ధ విమానం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ వాయుసేన స్థావరం నుంచి బయలుదేరిన అనంతరం ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలియగానే పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. జెట్‌ కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos