కాపులకు న్యాయం చేసింది టీడీపీనే: మంత్రి గంటా

కాపులకు న్యాయం చేసింది టీడీపీనే: మంత్రి గంటా

కాపులకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీయేనని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లపై కేంద్రం పేరుతో జగన్‌ తప్పించుకున్నారని విమర్శించారు. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. వారం రోజుల్లో విశాఖలో రీజినల్ కాపు భవన్‌కు శంకుస్థాపన చేస్తామని మంత్రి గంటా స్పష్టం చేశారు. కాగా ఈ ఏడాది నుంచే కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కేటాయింపులపై రాష్ట్రాలదే నిర్ణయమని ఆయన అన్నారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం చారిత్రకమన్నారు మంత్రి గంటా శ్రీనివాస్. కాపులకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ.. ఎప్పుడూ కాపుల పక్షాన నిలబడి పోరాడలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకు మేలు చేసేలా మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos