న్యూఢిల్లీ: ‘నేను ఒకటి అడగదలుచుకున్నాను.
1999 కాందహార్ ఘటనతో ప్రమేయం ఉన్న వారిని వదిలి వేసిందెవరు? దానికి బాధ్యులెవరు? వారిపైనే మన పోరాటం. ఇందుకు మన సైనికులెందుకు చనిపోవాలి? దీనికి శాశ్వాత పరిష్కారం అంటూ లేదా?’ అని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నిలదీశారు. సోమవారం అమృతసర్‌లో ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.
పుల్వామా ఉగ్రదాడి ఘటనపై తాను గతంలోచేసిన వ్యాఖ్యలకు కట్టుబడిఉన్నట్లు తేల్చి చెప్పారు.” ఉగ్రవాదుల చర్యలను ఖండించాలి కానీ, పాకిస్తాన్‌ను నిందించొద్దని “ఇటీవల చేసిన దుమారానిన రేపుతున్నాయి. పంజాబ్ విధానసభలో ఈ వ్యాఖ్యలపై వాగ్వాదాలు జరిగాయి. . ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను చేసిన వాదనకు కట్టుబడి ఉంటానని, ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించరాదని అన్నారు. పాక్‌తో దైపాక్షిక చర్యలతోనే కశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని పునరుద్ఘాటించారు.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎందుకు అన్వేషించరాదని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించరాదన్న తన వైఖరికి కట్టుబడి ఉంటానన్నారు. రాబోయే తరాలకు విఘాతంలా పరిణమించే ఉగ్రవాదాన్ని ఆసాంతం రూపుమాపాలని, ఉగ్ర దాడులకు బాధ్యులను కఠినంగా శిక్షించాలనిడిమాండు
చేసారు.