ఇస్లామాబాద్ : భారతతో యుద్ధం దిశగా సన్నద్ధమవుతున్న సంకేతాల్ని పాక్ పంపింది. మహ్మద్ ప్రవక్త ప్రవచనం-‘మీ శత్రువుతో యుద్ధాన్ని కోరుకోకుండా, అల్లా ఆదేశానుసారం వారిని మన్నించండి.అయితే యుద్ధ పరిస్థితి అనివార్యమైతే..అప్పుడు ధృడంగా నిలబడండి..కత్తుల నీడనే స్వర్గం ఉంటుందని మరువకండ’ని పాక్ విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎం ఫైజల్ ట్వీట్ చేశారు. భారత గగనతలంలోకి బుధవారం మధ్యాహ్నం చొచ్చుకు వచ్చిన పాక్ యుద్ధ విమానాలు ఎఫ్ 16ను భారత వైమానిక దళం దీటుగా తిప్పికొట్టింది. ఎఫ్ 16ను రాజౌరీ సెక్టార్‌లో వాయుసేన కూల్చి వేయగా, మరికొన్ని విమానాలు భారత భూభాగంపై బాంబులు జారవిడుస్తూ వెనుతిరిగి వెళ్లాయని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో వాటిల్లిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరా లేదు.