కక్ష సాధింపులే విచారణలు:మమత

ఢిల్లీ: రాబర్ట్‌ వాద్రాపై విచారణ మోదీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్‌కతా విమానాశ్రయంతో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘వారు(భాజపా) అన్నిచోట్ల ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. విచారణలన్నీ లోక్‌సభ ఎన్నికల ముందు భాజపా చేస్తున్న రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో విచారణలన్నీ భాగమే. తిరిగి అధికారంలోకి రాబోనని ప్రధాని మోదీకి ఇప్పటికే అర్థమయింది’’ అని అన్నారు.‘నియంతృత్వం నశించాలి..దేశాన్ని రక్షించాలి’ అనే నినాదంతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం నిర్వహించ తలపెట్టిన భారీ ప్రదర్శనకు మమత ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos