ఓటుకు నోటు కేసులో ఈడీ ఎదుట కాంగ్రెస్ నేతలు

ఓటుకు నోటు కేసులో ఈడీ ఎదుట కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డి, అతని కుమారుడు వేం కీర్తన్‌రెడ్డి మంగళవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో వేం నరేందర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షల రూపాయల లెక్కలపై ఈడీ ఆరా తీస్తోంది. నాలుగునర్న కోట్లు ఎక్కడివంటూ బ్యాంకు అకౌంట్స్‌ ముందు ఉంచి మరీ ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అటు మనీ ల్యాండరింగ్ వ్యవహారంపైనా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos