‘ఓటాన్‌ అకౌంట్‌ కాదు.. అకౌంట్‌ ఫర్‌ ఓట్స్‌’ చిదంబరం

‘ఓటాన్‌ అకౌంట్‌ కాదు.. అకౌంట్‌ ఫర్‌ ఓట్స్‌’   చిదంబరం

దిల్లీ: ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. ఇది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ లాగా లేదని, అకౌంట్‌ ఫర్‌ ఓట్స్ (ఓట్ల కోసం)‌లా ఉందని అన్నారు. అలాగే ఆయన గోయల్‌కు ధన్యవాదాలు తెలిపారు. దేశ వనరులు తొలుత పొందాల్సిన హక్కు పేదలది అని కాంగ్రెస్‌ చేసిన ప్రకటనను కాపీ చేసింనందుకు ధన్యవాదాలు అంటూ చిదంబరం ట్వీట్‌ చేశారు.పీయూష్‌ గోయల్‌ ఈరోజు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో రైతులకు, మధ్యతరగతి వారికి లభ్యం చేకూర్చేలా పథకాలు ప్రవేశపెట్టారు. అయిదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ.6వేలు అందించడం, వ్యక్తిగత పన్ను మినహాయింపును రూ.5లక్షలకు పెంచడం, గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షలకు పెంచడంతో పాటు 60ఏళ్లు నిండిన వారికి ప్రతి నెలా రూ.3వేల పింఛన్‌ వచ్చే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టారు. రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లు కేటాయించారు. మధ్యంతర బడ్జెట్‌ అయినప్పటికీ పథకాలు, కేటాయింపులు ఎక్కువగా ఉండడంతో చిదంబరం ఇది ఓట్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంటూ విమర్శించారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos