కులియా (ఒడిశా): ఒడిశా అధికారిక పార్టీ బీజేడీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దండిగా నిధులిచ్చినా రాష్ట్రం అభివృద్థిలో వెనుకబడిందని ఆరోపించారు. దీనికి కారణం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ‘అసమర్థత’, ‘నిర్లిప్తతే’ కారణమని దుయ్యబట్టారు. కటక్ జిల్లా కులియాలో ఇవాళ జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘‘ఎస్సీ, ఎస్టీలు సహా పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. దీంతో మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం…’’ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాల ‘మహాకూటమికి’ నాయకుడు, విధానం రెండూ లేవనీ.. అలాంటప్పుడు వాళ్లు బలమైన ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలరని ఆయన ప్రశ్నించారు.