ఒక్కో ఉద్యోగికి బోనస్‌గా రూ.62 లక్షలు!

  • In Money
  • January 23, 2019
  • 945 Views
ఒక్కో ఉద్యోగికి బోనస్‌గా రూ.62 లక్షలు!

బీజింగ్‌: పండుగల నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు ప్రకటించడం చూస్తూనే ఉంటాం. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం తమ ప్రతి ఉద్యోగికి రూ.62 లక్షలు చొప్పున బోనస్‌ ప్రకటించింది. వివరాల్లోకెళితే.. చైనాలో న్యూఇయర్‌ ఫెస్టివల్‌ మొదలైంది. ఏటా ఈ ఫెస్టివల్‌ మొదలైనప్పుడు కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో నాన్‌చాంగ్‌ నగరానికి చెందిన ఓ కంపెనీ బోనస్‌గా 300 మిలియన్‌ యువాన్లు (దాదాపు రూ.34 కోట్లు)డబ్బు కట్టలను గుట్టలుగా పేర్చింది.

ఈ డబ్బును కంపెనీ కార్యాలయంలో ప్రదర్శనగా ఉంచారు. ఈ కంపెనీలో దాదాపు 5000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షల చొప్పున బోనస్‌లు అందజేసింది. ‘ఇంత భారీ మొత్తాన్ని ఎలా ఖర్చుపెట్టాలో అర్థంకావడంలేదు’ అని ఓ ఉద్యోగి మీడియా ద్వారా వెల్లడిస్తూ సంబరపడిపోయాడు. గతంలోనూ నాన్‌చాంగ్‌ ఇదే విధంగా ఉద్యోగులకు బోనస్‌లు ప్రకటించింది. కంపెనీలోని ఓ హాలులో డబ్బు కట్టలను గుట్టలుగా పోసింది. ఒక్కో ఉద్యోగికి పరిమిత సమయం ఇచ్చి ఆ సమయంలో ఎంత డబ్బును తీసుకెళ్లగలిగితే అంత మొత్తం వారికి బోనస్‌లుగా ఇచ్చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos