ఏపీ మంత్రి సోమిరెడ్డికి షాక్‌..!

ఏపీ మంత్రి సోమిరెడ్డికి షాక్‌..!

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి గట్టి షాక్‌ తగిలింది. ఆయన సొంత బావ రామకోట సుబ్బారెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సమక్షంలో సుబ్బారెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకు​న్నారు. పార్టీ కేంద్రకార్యాలయం లోటస్‌పాండ్‌లో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. సుబ్బారెడ్డితో పాటు ఆయన కుమారులు శశిధర్‌రెడ్డి, కళాధర్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామకోట సుబ్బారెడ్డి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరి భర్త. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos