రాంచీ :ఝార్ఖండ్ రాష్ట్రంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని సింగభూం జిల్లాలో మావోయిస్టులు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు జరిగాయి. సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, కోబ్రా బెటాలియన్, ఝార్ఖండ్ సాయుధ పోలీసులు కలిసి అడవుల్లో మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. అంతలో మావోయిస్టుల నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. తిరిగి భద్రతా బలగాలు మావోయిస్టులపై కాల్పులు జరగడంతో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మరో మావోయిస్టు గాయాలతో తప్పించుకున్నారు. మావోయిస్టుల నుంచి రెండు ఏకే 47, 303 రైఫిల్, రెండు పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.