న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా అమెరికా నేషనల్ ఇంటిలిజెన్స్ సంస్థ సెనేట్ సెలక్ట్ కమిటీకి సంచలన నివేదిక అందజేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియాలో మత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బీజేపీ హిందుత్వ అజెండాతో కల్లోలాలు చెలరేగే సూచనలున్నాయని పేర్కొంది. 2019లో ప్రపంచాన్ని కుదిపేస్తాయనే అంచనాలు ఉన్న పలు అంశాలను అమెరికన్ ఇంటెలిజెన్స్ తన నివేదికలో ప్రస్తావించింది. భారత దేశంలో మతపరంగా ఒకింత ఉద్రిక్త పరిస్థితి ఉందంటూ అమెరికా నిఘా వర్గాలు పేర్కొనడం కలకలం రేపుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ బీజేపీ హిందుత్వ అజెండావైపు మళ్లుతోందని.. అందుకే ఇండియాలో ఉద్రిక్తతలకు అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. నివేదిక ఇచ్చిన బృందంలో సీఐఏ డైరెక్టర్‌తో పాటు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఇటీవలే ఇండియాలో పర్యటించిన అమెరికన్ నిఘా బృందాలు… ఇక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నివేదికను రూపొందించినట్టు స్పష్టం చేశాయి.