ఎదురు కాల్పుల్లో ఇద్దరు మృతి

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మృతి

   శ్రీనగర్‌ : జమ్ము-కాశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లాలో బుధవారం జరిగిన :”ఎదురు కాల్పుల్లో “ ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. బుద్గామ్‌లోని గోపాల్‌పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం మేరకు భద్రతా సిబ్బంది మంగళవారం రాత్రి నుంచి గాలింపులు జరుపుతోందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దశలో ఉగ్రవాదులు కాల్పులకు దిగారని, దీంతో భద్రతా సిబ్బంది కూడా కాల్పులు చేపట్టిందన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారని వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos