ఊరంత కలసి చంపేశారు..

  • In Crime
  • February 6, 2019
  • 185 Views
ఊరంత కలసి చంపేశారు..

వ్యవసాయ పొలాల మధ్య ఉన్న ఇంట్లో దొంగతనానికి వచ్చిన ఓ యువకుడిని గ్రామస్తులు పట్టుకుని చెట్టుకు కట్టి కొట్టి చంపేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం KV కుప్పం వద్ద చోటుచేసుకుంది. వేలూరు జిల్లా KV కుప్పం గ్రామ సమీపంలోని పొలాల్లో నివాసముంటున్న కాలన్న నాయుడు ఇంటికి.. సోమవారం అర్ధరాత్రి ముగ్గురు యువకులు దొంగతనానికి వచ్చారు. అలికిడికి మెలుకువ రావడంతో కాలన్ననాయుడు అప్రమత్తమయ్యాడు. గ్రామంలోని బంధువులకు ఫోన్ చేశాడు. అంతా కలిసి దొంగల్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఐతే.. ఇద్దరు తప్పించుకోగా ఒకడు వీళ్లకు దొరికాడు. ఇంతలో పారిపోయిన ఇద్దరు రాళ్లతో గ్రామస్తులపై దాడికి ప్రయత్నించారు. చివరికి.. దొరికిన దొంగను చెట్టుకు కట్టేసి ఊళ్లోవాళ్లంతా తీవ్రంగా కొట్టడంతో అతను చనిపోయాడు.ఈ విషయం తెలుసుకున్న KV కుప్పం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతిచెందిన వ్యక్తి అస్సాంవాసిగా గుర్తించారు. కొంత కాలంగా కొంతమంది యువకులు ముఠాగా వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కుప్పం సరిహద్దులో జరిగిన ఈ సంఘటనతో ఏపీ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos