ఉద్రిక్తతకు తెర

ఉద్రిక్తతకు తెర

హనోయి: భారత్‌, పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ముగింపు దశకు వచ్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిప్రాయ
పడ్డారు. గురువారం వియత్నాంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో భేటీ అయిన తర్వాత
మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ‘భారత్‌, పాక్‌కు సంబంధించి సహేతుకమైన మంచి సమాచారం
నా చెవిని పడింది. రెండు  దేశాల మధ్య ఏర్పడిన సమస్యలు ముగింపు దశకు చేరినట్లు
భావిస్తున్నాను’అని అన్నారు. తనకు అందిన ఆ శుభ సమాచారాన్ని  వెల్లడించేందుకు నిరాకరించారు. పుల్వామా దాడి తర్వాత
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు వెల్లువెత్తి సమర వాతావరణం ఏర్పడింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో మూడో భేటీ ఉండబోటని చెప్పారు. అణ్వాయుధాలను త్యజించేందుకు ఉత్తర కొరియా నిరాకరించటంతో ట్రంప్‌  తదుపరి భేటీకి
విముఖత వ్యక్తం చేశారు. తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాల్సిందిగా  కిమ్‌ చేసిన వినతికి ట్రంప్‌
నిరాకరించటంతో  రెండు దేశాధినేతల మధ్య ఎటువంటి ఒప్పందాలు జరగకుండానే సమావేశం ముగిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos