ఉగ్రవాదులతో పాక్ మాటా మంతి

ఉగ్రవాదులతో పాక్ మాటా మంతి

ఇస్లామాబాద్‌: నిషేధిత ఉగ్ర వాద సంస్థ జైషే సంస్థ నాయకులతో పాక్‌ ప్రభుత్వం సంప్రదింపుల్ని సందర్భోచింగా చేస్తోందని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి వెల్లడించారు. తాజాగా శనివారం  మరో అంతర్జాతీయ మాధ్యమ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మసూద్‌ తో ఉన్న సంబంధాల గురించి వివరించారు. తాము జైషే  ఉగ్ర వాద సంస్థ నాయకులను సంప్రదించినపుడు  పుల్వామా ఉగ్ర దాడికి తాము పాల్పడలేదని  చెప్పారన్నారు. ‘దీంతో ఈ విషయంపై కొంత గందరగోళం నెలకొంది’’ అని పేర్కొన్నారు. జైషే సంస్థతో ‘వారికి తెలిసిన వ్యక్తులే’ సంప్రదించారని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు.  పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు జైషే సంస్థ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి భిన్నంగా ఖురేషి సమాధానం ఉండటం గమనార్హం.భారత్‌లో పలు ఉగ్రదాడుల సూత్రధారి, జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ తమ దేశంలోనే ఉన్నట్లు శుక్రవారం  పాక్ అంగీకరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos