
న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఐఎన్‌ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు.. ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు.. ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చిందో చెప్పాలని ఈడీ ప్రశ్నించింది. కాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో గతేడాది ఫిబ్రవరిలో కార్తీ చిదంబరం అరెస్టైన సంగతి తెలిసిందే. కార్తీ తండ్రి పి.చిదంబరం.. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఈ లావాదేవీలు జరగడంతో ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి.