శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం ఉదయం రక్షణ బలగాలు, ఉగ్రవాదుల మధ్య సంభవించిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలపై ఉగ్ర వాదులు తొలుత కాల్పులు జరిపారు. దరిమిలా రెండు వర్గాల మధ్య కాల్పులు సంభవించాయి. పర్యవసానంగా
ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు
అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల గాలింపు లు కొనసాగు తున్నాయి.