ఇదే నా నవ భారతం? మోదీకి రాహుల్‌ ప్రశ్న

ఇదే నా నవ భారతం? మోదీకి రాహుల్‌ ప్రశ్న

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి కాంగ్రెస్ అధినేత రాహుల్
గాంధీ గురువారం మరో సారి ప్రధాని నరేంద్ర మోదీ పై ధ్వజ మెత్తారు. పుల్వామా ఘటన, రాఫెల్
అవినీతి ఆరోపణల్ని కలిపి   పెట్టుబడి దారులు, అవినీతి అస్త్రాలుగా ప్రధాని పై
గురువారం ట్వీట్‌లో  విమర్శనాస్త్రాల్ని
సంధించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ ఒత్తిడి వల్లే రాఫెల్ విమానాల తయారీ ఆ‌ఫ్‌సెట్
భాగస్వామిగా డసాల్ట్‌ సంస్థ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స సంస్థను ఎంపిక
చేసినట్లు కాంగ్రెస్ ఇది వరకూ పలుమార్లు ఆరోపించింది. ప్రభుత్వం, భద్రతా దళాలకు
‘‘ప్రతిపక్షం మొత్తం’’ అండగా నిలబడుతుందన్న వారం రోజుల్లోనే మోదీ ప్రభుత్వంపై
రాహుల్ గాంధీ మరోసారి విరుచుకు పడ్డారు. ‘‘సాహస వీరులు అమరులయ్యారు. వాళ్ల
కుటుంబాలు శోకంలో మునిగిపోయాయి. 40 మంది సైనికులు తమ ప్రాణాలను అర్పించినా అమర వీరుల
హోదాకి నోచుకోలేదు. ఈ మనిషి (మోదీ)కి కేవలం తీసుకోవడం తప్ప, ఇచ్చింది ఎప్పుడూ
లేదు. రూ.30 వేల కోట్ల వారి (సైన్యం) సొమ్మును అప్పనంగా కట్టబెట్టేశారు. దాని
పొందిన వాళ్లు ఎప్పటికీ హాయిగా బతికేస్తారు. ‘మోదీ నవ భారతానికి’ స్వాగతం’ అని హేళన చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos