ఇదుగో వచ్చాడు.. మరో ఎన్టీఆర్

  • In Film
  • January 19, 2019
  • 921 Views
ఇదుగో వచ్చాడు.. మరో ఎన్టీఆర్

మొన్నటివరకు ఎన్టీఆర్-కథానాయకుడు రూపంలో ఒక ఎన్టీఆర్ ను మాత్రమే చూశాం. ఇప్పుడు మరో ఎన్టీఆర్ తెరపైకి రాబోతున్నాడు. ఇతడు వర్మ సృష్టించిన ఎన్టీఆర్. అవును.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నుంచి లీడ్ రోల్ పోషిస్తున్న ఎన్టీఆర్ ను తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు వర్మ.”వెన్నుపోటు వల్ల చనిపోయిన ఎన్టీఆర్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో మరోసారి మనముందుకొచ్చారు” అంటూ ఎన్టీఆర్ లుక్ ను విడుదల చేశాడు వర్మ. అంతకంటే ముందు తనదైన స్టయిల్ లో చాలా పెద్ద ప్రహసనమే నడిపాడు.సాయంత్రం 5 గంటలకు కాకుండా.. 6 గంటల 57 నిమిషాలకు ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని, ఎందుకంటే 6,5,7 సంఖ్యల్ని కలుపుకుంటూ వెళ్తే సంఖ్యాశాస్త్రం పరంగా 9 వస్తుందని, అందుకే ఎన్టీఆర్ సెంటిమెంట్ ప్రకారం ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని కలరింగ్ ఇచ్చి మరీ రిలీజ్ చేశాడు.ఫస్ట్ లుక్ టీజర్ లో తనదైన కెమెరా యాంగిల్ చూపించాడు వర్మ. తనకెంతో ఇష్టమైన లైటింగ్, కెమెరా యాంగిల్స్ లో క్లోజ్ షాట్ లో ఎన్టీఆర్ ను చూపించాడు. ఫస్ట్ లుక్ టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు వర్మ. సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ చేసిన వర్మ, త్వరలోనే లక్ష్మీపార్వతి పాత్రకు చెందిన టీజర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు.లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రాజెక్టుకు సంబంధించి లక్ష్మీపార్వతి, చంద్రబాబు పాత్రధారుల లుక్స్ ను ఇప్పటికే వర్మ విడుదల చేశాడు. టైటిల్ కు “అసలు కథ” అనే క్యాప్షన్ తగిలించిన వర్మ, ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అసలైన సంఘటనల్ని బయటపెడతానంటున్నాడు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos